Kalvakuntla Kavitha: జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడు, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ అతడిని వీల్ చైర్ పై నుండి ఈడ్చుకుంటూతీసుకోని వెళ్ళాడు. ఆ దివ్యాంగుడు వీల్ చైర్ కింద పడిపోయిన పట్టించుకోని కానిస్టేబుల్.. ఈ ఘటన అంత అక్కడ ఉన్న కలెక్టర్ ముందే జరిగిన హులుకు పలుకు లేకుండా చూస్తుండిపోయాడు.
ఈ సంఘటనపై కవిత ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ..
“ప్రజాపాలన అంటే ఇదేనా? ఒక దివ్యాంగుడిని ఇలా అవమానించడం అత్యంత దుర్మార్గం” అని అన్నారు. ఆమె, ఘటనకు కారణమైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, తన కళ్ల ముందే ఇంతటి దారుణం జరిగినా స్పందించని జగిత్యాల కలెక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజాపాలన అంటే ఇదేనా?
ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గం
ఈ ఘటన కు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల… pic.twitter.com/RJXfoM0CkW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 11, 2025