Krishna Nagar

Krishna Nagar: కృష్ణానగర్‌లో కొనసాగుతన్న సినీ కార్మికుల నిరసన

Krishna Nagar: కృష్ణానగర్ ప్రాంతంలో సినీ కార్మికులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్యంగా ఫైటర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సినిమా విజయానికి తాము చేసే పోరాటాలు, స్టంట్స్ ఎంత ముఖ్యమో వివరించారు.

‘స్కిల్ లేని వాళ్లం’ అని ఎలా అంటారు?
సినీ పరిశ్రమలో తమను ‘స్కిల్ లేని వాళ్లు’ అని పిలవడంపై ఫైటర్స్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “సినిమాలో ప్రాణం పోసేది మా స్టంట్స్. అలాంటి మమ్మల్ని స్కిల్ లేని వాళ్లం అని ఎలా అంటారు?” అని ప్రశ్నించారు. తమ శ్రమకు సరైన గుర్తింపు లేకపోవడంపై వారు ఆవేదన చెందారు.

మాకు వాటాలు వద్దు, వేతనాలు పెంచండి
కార్మికులు తమ డిమాండ్లను స్పష్టం చేశారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో తమకు వాటాలు అవసరం లేదని, కేవలం తమ శ్రమకు తగ్గ సరైన వేతనం మాత్రమే కావాలని కోరారు. “పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలి. మేము వేతనాలు పెంచాలని అడిగితే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సబబు?” అని మండిపడ్డారు.

ఒత్తిడి చేయడం లేదు… గుర్తించండి చాలు
తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని, కేవలం తమకు రావాల్సిన గౌరవాన్ని, గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నామని కార్మికులు తెలిపారు. ప్రతి సినిమా వెనుక తమ కష్టం ఉందని, అలాంటి తమను నిర్లక్ష్యం చేయవద్దని వేడుకున్నారు. ఈ నిరసనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వం, సినీ ప్రముఖులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *