Su From So: ఒక సినిమా బడ్జెట్‌కు ఎనిమిది రెట్లు లాభాలు తెచ్చిందంటే నమ్మశక్యంగా లేదు కదా? కన్నడ సినిమా రంగంలో ఓ చిన్న చిత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొన్ని కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు లాభాల వర్షం కురిపించిన ఈ చిత్రం ఏదో తెలుసా? సినీ ప్రపంచంలో ఈ సినిమా ఎలా సందడి చేస్తోంది?
Also Read: Young Tiger NTR: ఎన్టీఆర్ సరికొత్త రికార్డు: ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై తొలిసారి
కన్నడ చిత్రసీమలో ‘సు ఫ్రమ్ సో’ అనే కామెడీ డ్రామా అద్భుతం సృష్టించింది. రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, ఏకంగా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి షాక్ ఇచ్చింది. నెట్ వసూళ్లు రూ.30 కోట్లుగా అంచనా. ఇది 848% లాభాలను అందించి నిర్మాతలను ఆనందంలో ముంచెత్తింది. పెద్ద చిత్రాల సమయంలో విడుదలైనా, ఈ చిన్న సినిమా తనదైన మార్క్ చూపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఆగస్ట్ 8వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుంది.
Someshwara Sulochana anta👻#SuFromSoTelugu Trailer Out Now💥💥
🔗https://t.co/5X87xZ9or6Kannada’s biggest blockbuster #SuFromSo in Telugu from 8th August ❤🔥
Grand release across the Telugu States by @MythriRelease ✨@RajbShettyOMK @lighterbuddha @jpthuminad… pic.twitter.com/uUQOeb2SYX
— Mythri Movie Distributors LLP (@MythriRelease) August 5, 2025

