Tamannaah Bhatia

Tamannaah Bhatia: పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌.. తమన్నా రియాక్షన్‌ ఇదే 

Tamannaah Bhatia: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై నటి తమన్నా భాటియా స్పష్టత ఇచ్చారు. ఈ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. తమన్నా, రజాక్ కలిసి ఒక జ్యువెలరీ షాప్‌లో ఉన్న పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లపై స్పందిస్తూ తమన్నా ఒక ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి తమన్నా, రజాక్ ఇద్దరూ అతిథులుగా హాజరయ్యారని, ఆ సందర్భంలోనే ఈ ఫోటో తీశారని ఆమె తెలిపారు.

అంతేకానీ, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, పెళ్లి చేసుకోవడం అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక ఫొటో ఆధారంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు. తమన్నా ఈ పుకార్ల గురించి మాట్లాడుతూ, అవి చాలా వింతగా, ఇబ్బందికరంగా అనిపించాయని తెలిపారు. ఆ ఫొటో కేవలం ఒక ఈవెంట్‌లో తీసుకున్నదే తప్ప, తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే, రజాక్‌కి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారని, ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi: సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి

తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని, పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు విరాట్ కోహ్లీతో తన రిలేషన్‌షిప్‌ గురించి వచ్చిన రూమర్స్‌పైనా నటి తమన్నా భాటియా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా కేవలం పనికిమాలిన ప్రచారం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. సుమారు 11 ఏళ్ల క్రితం, తమన్నా, విరాట్ కోహ్లీ ఒక యాడ్‌లో కలిసి నటించారు. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *