Krishna Master Pocso Case: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు నమోదైంది. ప్రముఖ టీవీ షో ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గత నెలలోనే కృష్ణ మాస్టర్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
అయితే, కృష్ణ బెంగళూరులోని తన సోదరుడి నివాసంలో ఉన్నాడని తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణను కంది జైలుకు తరలించారు.
ఇటీవలే కృష్ణకు ఒక మహిళతో వివాహం జరిగిందని, తన భార్యకు సంబంధించిన 9 లక్షల నగదును తీసుకుని వెళ్లిపోయాడని కూడా సమాచారం. గతంలో కూడా కృష్ణ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.