Kim Sharma: బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. రెడ్ హాట్ బికినీ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టోన్డ్ ఫిజిక్, పర్ఫెక్ట్ యాబ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో డేటింగ్ వార్తలతో హెడ్‌లైన్స్‌లో నిలిచిన ఈ భామ, ఇప్పుడు కొత్త లుక్‌తో సినీ రీ-ఎంట్రీకి సిద్ధమవుతోందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: OG-Coolie: ఓజి, కూలీ: సినీ ప్రియులకు డబుల్ ధమాకా!
బాలీవుడ్, టాలీవుడ్‌లో తన అందంతో ఆకట్టుకున్న కిమ్ శర్మ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. విదేశీ బీచ్‌లో రెడ్ బికినీలో ఆమె లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. 45 ఏళ్ల వయసులో టోన్డ్ బాడీ, చిత్ర విచిత్రమైన యాబ్స్‌తో యువతరాన్ని ఆశ్చర్యపరిచింది. గతంలో టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, యువ హీరో హర్షవర్ధన్ రాణేలతో డేటింగ్ వార్తలతో హాట్ టాక్‌గా నిలిచిన కిమ్, కెన్యాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే, విడిపోయిన తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఈ భామ, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఖడ్గం, ఆంజనేయులు, మగధీర చిత్రాలతో పాపులర్ అయిన కిమ్, మళ్లీ సినిమాల్లో బిజీ కావడానికి సన్నాహాలు చేస్తుందని టాక్. ఈ లుక్‌తో సినీ ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఖాయమని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram