Donald Trump:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌న‌కు అందుకే నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలి.. ఎవ‌ర‌న్నారో తెలుసా?

Donald Trump:అమెరికా దేశానికి రెండోసారి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక డొనాల్డ్ ట్రంప్ వైరుధ్యాల‌తో కూడిన వైఖ‌రిని అవ‌లంబిస్తున‌నారు. త‌న మాట విన‌ని దేశాల‌పై సుంకాల‌తో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా ర‌ష్యా, భార‌త్‌పై 25 శాతం దిగుమ‌తి సుంకాలు విధిస్తూ ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న మాట విన‌ని దేశాల‌పై బెదిరింపుల‌కు దిగుతున్నారు. అలాంటి ట్రంప్‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌నే విన‌తులు పెరుగుతున్నాయి.

Donald Trump:ఇప్ప‌టికే డొనాల్డ్ ట్రంప్‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ త‌న‌కు అనుకూలురైన‌ పాకిస్థాన్‌, ఇజ్రాయిల్ దేశాల ప్ర‌ధానులు క‌మిటీ నిర్వాహ‌కుల‌కు లేఖ‌లే రాశారు. తాజాగా ట్రంప్‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ వైట్ హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలిన్ లీవిట్ కోరారు. ఎందుకంటే ఇండియా- పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపినందుకే ఇవ్వాలంటూ కోరారు.

Donald Trump:అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా-పాక్ యుద్ధాన్ని ఆప‌డంతోపాటు థాయ్‌లాండ్‌-కంబోడియా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌, రువాండా-డెమొక్రాటిక్ రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా-కొసావో, ఈజిఫ్ట్‌-ఇథియోఫియా దేశాల మ‌ధ్య యుద్ధాల‌ను ఆపార‌ని వైట్ హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలిన్ లీవిట్ పేర్కొన్నారు.

Donald Trump:డొనాల్డ్ ట్రంప్ స‌గ‌టున నెల‌కు ఒక శాంతి ఒప్పందం, లేదా కాల్పుల విర‌మ‌ణను చేయించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఆందుకే డొనాల్డ్ ట్రంప్‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా, ఆయ‌న అధ్య‌క్షుడు అయ్యాక నియంతృత్వ పోక‌డ‌ల‌తో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆరోపిస్తూ అమెరికా దేశ‌వ్యాప్తంగా ఇటీవ‌లే నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

Donald Trump:ప్ర‌పంచంలో ఆయ‌న మాట‌కు విలువ ఇవ్వ‌ని దేశాల‌ను శ‌త్రు దేశాలుగా భావిస్తూ ఆంక్షలు విధిస్తూ క‌ఠిన వైఖ‌రిని ప్ర‌దర్శిస్తున్నారు. ఈ ద‌శ‌లో డొనాల్డ్ ట్రంప్‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి అనేది అంద‌ని ద్రాక్షే అవుతుంద‌ని ఎంద‌రో విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌స్తుందో? రాదో? వేచి చూడాలి మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *