nara lokesh

Nara Lokesh: కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, అనుకోని ఆపద ఎదురైనా  మొదటగా గుర్తుకువచ్చేది విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపడుతున్న ప్రజాదర్బార్. ఇక్కడకు వస్తే చాలు.. తమ సమస్యలకు, కన్నీళ్లకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. మంత్రి లోకేష్ కు తమ గోడు వినిపిస్తే.. ఆలకించి అండగా నిలుస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న ప్రజాదర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొదట మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ఏర్పాటుచేయగా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.

ఇప్పటివరకు 2,219 సమస్యలకు పరిష్కారం 

ప్రజాదర్బార్ ద్వారా ఇప్పటివరకు 4,753 విజ్ఞప్తులు స్వీకరించారు. 2,219 సమస్యలకు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ పరిష్కారం చూపింది. విజ్ఞప్తుల్లో సగానికి పైగా భూవివాదాలు, హోంశాఖకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్య, ఇళ్ల నిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన విజ్ఞప్తులు ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ అదనంగా 863 మంది ప్రజాదర్బార్ ద్వారా విన్నవించారు. ఆయా విన్నపాల్లో మొదటివిడతగా 350 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వీరికి నియామక పత్రాలు అందించనున్నారు. 

ప్రజాదర్బార్ ద్వారా పరిష్కరించిన సమస్యలు

Nara Lokesh: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరుచేయకపోవడంతో చనిపోయిన తన భర్త పేరుపై ఉన్న 12.98 ఎకరాల వ్యవసాయ భూమిని తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టిషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని పొన్నూరుకు చెందిన మాడభూషి సరోజిని విజ్ఞప్తి చేశారు. తన నలుగురి సంతానంలో ఒక కుమారుడు సహకరించనందున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరుకు తహశీల్దార్ నిరాకరించారని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. సదరు సమస్యపై ప్రజాదర్బార్ యంత్రాంగం మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ తో విచారణ చేయించారు. అర్జీదారునితో ఫోన్ లో సంప్రదించి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేయించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. 

– నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన పాదర్తి రామానాయుడు ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి తన సమస్యను విన్నవించారు. గ్రామంలో తన 4.95 ఎకరాల భూమిని సర్వేచేసి హద్దు రాళ్లు వేయాల్సిందిగా అధికారులను కోరాను. ఆ విధంగానే సర్వేచేసి హద్దురాళ్లు వేశారు. అయితే తన పొలం పక్కనే ఉన్న గుమ్మడి రామచంద్రయ్య సర్వేరాళ్లను పెకలించి భూమిని ఆక్రమించుకున్నారు. దీనిపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా హద్దురాళ్లు వేసే బాధ్యతే తమదని, పెరికేస్తే తమకు సంబంధం లేదని, పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆక్రమణకు గురైన తన భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని మంత్రిని కోరారు. సదరు అర్జీని పరిశీలించి రెవెన్యూ అధికారులకు పంపడం జరిగింది. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భూమికి హద్దులు ఏర్పాటుచేసి, సదరు భూమిని అర్జీదారునికి అప్పగించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది.

ఇది కూడా చదవండి: Team India: ఈ పరాభవం కొన్ని తరాలు వెంటాడుతుంది

– పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గుజ్జర్లపూడి ఉషా కుమారి ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. తాము ఎస్సీ(హిందూ) సామాజికవర్గం అయితే .. గత వైసీపీ ప్రభుత్వంలో ఓసీ గా నమోదుచేసి ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని వాపోయారు. తనకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సదరు అర్జీని సత్తెనపల్లి పదో వార్డు రెవెన్యూ సెక్రటరీతో విచారణ జరిపించారు. గుజ్జర్లపూడి ఉషాకుమారి కుటుంబం 2021లో విజయవాడలో నివసించేవారు. అనంతరం సత్తెనపల్లికి మారగా.. హౌస్ మ్యాపింగ్ లో వీరి ఆధార్ కార్డుపై హిందూ(ఓసీ)గా నమోదు చేశారని గుర్తించారు. అర్జిదారురాలితో మళ్లీ దరఖాస్తు చేయించి, సదరు అర్జీదారురాలి హౌస్ మ్యాపింగ్ లో కులాన్ని మార్చారు. రీ ఇష్యూ క్యాస్ట్ సర్టిఫికెట్ ఆప్షన్ ద్వారా అర్జిదారురాలికి ఆధార్ కార్డును అనుసరించి ఎస్సీ(హిందూ) కుల ధవీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది.

బారికేడ్లు, పరదాలు లేవు 

గత వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమతమైన వారి గోడు ఆలకించిన వారు లేరు. ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న బాధితులను నిర్దాక్షణ్యంగా బయటకు గెంటివేసిన పరిస్థితి. గేటు కూడా తాకనివ్వలేదు. ఐదేళ్లలో ఏనాడూ ప్రజలను తాడేపల్లి ప్యాలెస్ లోకి రానివ్వలేదు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డును బ్లాక్ చేశారు. బారికేడ్లు, పరదాలతో  ప్రజలను నిలువరించారు. దీంతో ప్రజాగ్రహానికి గురై వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఐదేళ్లలో తాము పడిన బాధలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసానికి ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. వారిపట్ల ఎలాంటి ఆంక్షలు, సెక్యురిటీ నిబంధనలు లేవు. 

ఇది కూడా చదవండి: Abdul Rahim Rather: జమ్మూకాశ్మీర్ స్పీకర్ గా అబ్దుల్ రహీమ్ రాథర్

ప్రజలను స్వయంగా కలుసుకుని విజ్ఞప్తుల స్వీకరణ

Nara Lokesh: తుఫాన్లను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం బాధితులు ప్రజాదర్బార్ కు తరలివస్తున్నారు. ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. మంగళగిరి ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను స్వయంగా కలుసుకుని.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారా లోకేష్ వినతులు స్వీకరిస్తున్నారు. పలు సమస్యలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజాదర్బార్ కు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఉండవల్లి నివాసంలోనే కాకుండా జిల్లాల పర్యటనలోనూ ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. 

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

ప్రజాదర్బార్ కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ప్రజా విజ్ఞప్తులను శాఖల వారీగా విభజించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ప్రజాదర్బార్ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యలు ఎన్ని పరిష్కారం చేయగలిగాం అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా తానే మంత్రులతో మాట్లాడి సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిబ్బంది సంబంధిత శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *