Narne Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. అతని తొలి చిత్రం ‘మ్యాడ్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన ‘ఆయ్’ కూడా బాక్సాఫీస్ బరిలో మెప్పించింది. అతను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ విడుదలకు రెడీగా ఉండగా, ‘మ్యాడ్’ సీక్వెల్ సెట్స్ పై ఉంది. ఇదిలా ఉంటే… నితిన్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 3వ తేదీ హైదరాబాద్ లో జరిగింది. తాళ్ళూరి వెంకట ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె శివానీ మెడలో నితిన్ మూడు వెళ్ళ బోతున్నాడు. హీరో వెంకటేశ్ కుటుంబానికి తాళ్ళూరి ఫ్యామిలీకి చుట్టరికం ఉండటంతో వారూ ఈ నిశ్చితార్థానికి హాజరై సందడి చేశారు. పెళ్ళి తేదీ తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Simbu: కమల్ నుంచి ‘బ్లడ్ అండ్ బ్యాటిల్’ శింబు చేతికి..