Liquor Scam YCP MPs

Liquor Scam YCP MPs: పార్లమెంట్‌ లోపలా, బయటా అనుమాస్పదంగా చూస్తున్నారా?

Liquor Scam YCP MPs: ప్రస్తుతం అటు ఢిల్లీలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటు రాష్ట్రంలో లిక్కర్‌ స్కామ్‌కి సంబంధించి సంచలన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ మిధున్‌ రెడ్డి అరెస్ట్‌తో పాటూ, సిట్‌ చార్జ్‌ షీట్‌ వేసిన తర్వాత… ఈ అంశం జాతీయ మీడియాలో సంచలనం అయి కూర్చుకుంది. ఆధునిక భారత దేశంలో ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద స్కామ్‌గా లిక్కర్‌ స్కామ్‌ కనిపిస్తుండటంతో.. దేశం అంతా షాక్‌లో ఉంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ చూశాం, ఛత్తీస్‌గఢ్‌, కేరళ వంటి రాష్ట్రాల్లో లిక్కర్‌ పాలసీలలో జరిగిన అనివీతి చూశాం.. కానీ ఇదేంటండీ బాబు… ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ మరెక్కడా చూడలేదంటూ నోరెళ్లబెడుతోంది నేషనల్‌ మీడియా. ఇప్పుడు ఢిల్లీ రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే హాట్‌ టాపిక్‌. దీంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలకు హారజరవ్వాలంటేనే సిగ్గుతో సచ్చిపోతున్నారట.

300 పేజీల చార్జ్‌ షీట్‌, 340 పాయింట్లతో వైసీపీ నేతల తప్పుల్ని సిట్‌ క్లిస్టర్‌ క్లియర్‌గా మెన్షన్‌ చేసినా కూడా…. జాతీయ, అంతర్జాతీయ మీడియా అవాక్కవుతూ కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా… మేమేమీ తప్పు చేయలేదు, అసలు స్కామే జరగలేదు, ఇదంతా పొలిటికల్‌ వెండెట్టా, రాజకీయ కక్ష అంటూ మాట్లాడుతోంది వైసీపీ. ఆ పార్టీ నేతలు చేస్తున్న మొండి వాదన, సమర్థించుకుంటున్న తీరు చూస్తుంటే… వీరికి ఏ మాత్రం సిగ్గనేదే ఇవ్వలేదా దేవుడు.. అంటూ ప్రజలు అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఇదే ఢిల్లీలో వైసీపీ ఎంపీల పరువుతీస్తోంది. సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. “ఢిల్లీలో కేజ్రీవాల్‌ చేసింది వంద కోట్ల చిల్లర స్కామ్‌. కానీ ఏపీలో జగన్ రెడ్డి చేసింది ఊహలకు అందనంత పెద్ద స్కామ్‌. అందుకే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ని చిల్లర స్కామ్‌ అనాల్సి వస్తోంది.

Also Read: Sri Lanka: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 40 దేశాలకు ఉచిత టూరిస్టు వీసా

వెలుగుచూస్తున్న వాస్తవాలు భారతదేశమే షాక్‌ అయ్యేలా ఉన్నాయి. నేషనల్‌ మీడియా చాలా ఇండెప్త్‌గా ఈ స్కామ్‌పై డిస్కస్‌ చేస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీలు సభలో అడుగుపెడుతుంటే… నిండు సభలో సభ్యులంతా వారివైపే అనుమానాస్పదంగా చూస్తున్నారట. ఏంటిది? మమ్మల్ని ఇలా దొంగల్లా చూస్తున్నారు.. అంటూ వైసీపీ ఎంపీలు తమకు జరుగుతున్న అవమానానికి లోలోపలే కుంగిపోతున్నారట. పార్లమెంట్‌ లోపలా, బయటా.. చాలా ఎంబరాస్‌మెంట్‌గా, సిగ్గుతో తల దించుకుని వెళ్లేలాగా వారి పరిస్థితి ఉందట. “జగన్‌ రెడ్డి చేసిన పనికి, మేం ఈ పరిస్థితికి వచ్చాం” అంటూ వారు తమ సహచర ఎంపీలు, ఢిల్లీలో తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

ఎంపీ మిధున్‌ రెడ్డి గతంలో లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. దేశంలో అత్యున్నత చట్ట సభ అయిన లోక్‌సభలో.. సభాధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు మిధున్‌ రెడ్డి. అటువంటి వ్యక్తి వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో జైలుకెళ్లాడంటే… అది దేశానికి అవమానం కూడా. ఆ రకంగా దేశ ప్రతిష్టని దెబ్బతీశారు ఏపీ స్కామ్‌స్టర్లు. అయితే ఈ కేసులో… హండ్రెడ్‌ పర్సెంట్‌, ఈడీ, సీబీఐ, ఫెమా యాక్ట్‌కి అటాచ్‌ అవుతుండటం వల్ల… ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్‌ అవ్వబోతున్నాయని నేషనల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. ఈ దేశం ఓక గజినీనో, ఔరంగజేబునో గుర్తు పెట్టుకున్నట్లు… జగన్‌ రెడ్డిని కూడా గుర్తుపెట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *