DSPs Road Accident: తెలంగాణలోని యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఖైతాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మరణించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అకాల మరణించడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.
ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, మరణించిన డీఎస్పీల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన పట్ల మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ప్రమాదానికి గురికావడం విచారకరమని వారు పేర్కొన్నారు.
Also Read: PM Narendra Modi: మాల్డీవులలో మోదీకి అరుదైన గౌరవం
ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. అలాగే, మరణించిన డీఎస్పీల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ ఘటన రెండు పోలీసు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం పాటుపడుతుంటారని, అలాంటి వారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.