Toothbrush

Toothbrush: టూత్‌బ్రష్‌ను మింగేసిన మహిళ.. 45 నిమిషాల తరువాత

Toothbrush: కోల్‌కతాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళ పొరపాటున టూత్‌బ్రష్‌ను మింగేసింది. ఈ ఘటనతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని, ఛాతీలోనూ నొప్పిగా ఉన్నట్లు చెప్పింది. వివరాల్లోకి వెళితే, బాధితురాలు ఆకస్మికంగా టూత్‌బ్రష్‌ను మింగేయడంతో ఆమెకు తీవ్ర నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తాయి.

వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు జీఐ ఎండోస్కోపీ చేసిన తర్వాత షాకయ్యారు, బ్రష్‌ను తొలగించడానికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. ఆ టూత్‌బ్రష్‌ను బయటకు తీసేందుకు వైద్యులు 45 నిమిషాలు కష్టపడ్డారు. ఎండోస్కోపీ సాయంతో నోటి నుంచి ఒక సన్నటి దారాన్ని పంపి, ఆ దారంతో బ్రష్‌ను ముడివేసి ఎంతో జాగ్రత్తగా బయటకు లాగారు. మహిళకు పూర్తిగా మత్తుమందు ఇచ్చి, డాక్టర్‌ సంజయ్‌ బసు నేతృత్వంలో వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: UPI New Rules: ఆటో పే ఆ టైం లో పనిచేయదు.. ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్‌

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అదృష్టవశాత్తు, సకాలంలో వైద్య సహాయం అందడం వల్ల ఆ మహిళకు ప్రమాదం తప్పింది. ఇలాంటి విచిత్ర సంఘటనలు అరుదుగా జరిగినా, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత ఆ మహిళ ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఇలాంటి వస్తువులు కడుపులోకి వెళ్లినప్పుడు శస్త్రచికిత్స అవసరం పడుతుందని అన్నారు. కానీ ఎండోస్కోపీ ద్వారా టూత్‌బ్రష్‌ను తొలగించడం అనేది వైద్య రంగంలో ఒక అద్భుతంగా భావిస్తున్నామని.. ఇది విజయవంతం కావడం మరింత సంతోషంగా అనిపిస్తోందని వైద్యులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *