Supreme Court Of India:తన భర్త నుంచి ఓ మహిళ భారీ మొత్తంలో భరణం ఆశించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అది కూడా పెళ్లయిన 18 నెలలకే ఆమో తన భర్త నుంచి విడాకులు కోరడంపైనా నిలదీసింది. అంత పెద్దమొత్తంలో భరణం కోరే బదులు.. నువ్వే సంపాదించుకోవచ్చు కదా.. అని సలహా కూడా ఇచ్చింది. ముంబైకి చెందిన భార్యాభర్తల విడాకుల కేసు విచరాణపై సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Of India:ఓ మహిళ పెళ్లయిన 18 నెలలకే విడాకులు కోరుతూ, తన భర్త నుంచి భారీ మొత్తంలో భరణం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన భర్త నుంచి విడాకుల భరణం కింద బీఎండబ్ల్యూ కారు, ముంబైలో ఒక ఇల్లు, రూ.12 కోట్ల నగదు ఇప్పించాలని పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలను చేసింది. మీరు ఎంబీఏ చేశారు.. మంచి ఉద్యోగం చేసుకొని మీరే సంపాదించుకోండి.. అంటూ వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Of India:మీరు ఎంబీఏ చదివారు.. ఐటీ ప్రొఫెషనల్, సంపాదించే సామర్థ్యం ఉన్నది.. చక్కని ఉద్యోగం చేసుకోండి.. అంటూ ఆ మహిళకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. అయితే తన భర్త ధనవంతుడని, తాను మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నానని అతనే విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, తాను మానసిక ఇబ్బందులు ఉన్నట్టు కనిపిస్తున్నానా అంటూ బీఆర్ గవాయ్‌ను ఆ మహిళ ప్రశ్నించింది. దీంతో ముంబైలో ఒక ఇల్లు లేదంటే, రూ.4 కోట్ల భరణం తీసుకోవాలని ఆ మహిళకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు.
