Adultered toddy: పాలు.. కల్లు తెల్లగానే ఉంటాయి.. ఇంకేముంది.. పాల ప్యాకెట్ల లెక్కే నీట్‌గా తయారు చేశాడు.. దానికి దేవుడి బొమ్మ వేసి ఎస్‌వీఎస్ అనే అందమైన పేరు కూడా పెట్టాడు. ఎంచక్కా కల్లు ప్యాకెట్ల అమ్మకాలు మొదలుపెట్టిండు. ఇది మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచమ్మ, కండ్లకోయ, అయోధ్యనగర్ ప్రాంతాల్లో ఈ కల్లు ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
Adultered toddy: ఇటీవల హైదరాబాద్ నగరంలోని పలు కల్లు కంపౌండ్లలో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోగా, ఇప్పటికే చాలా మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ దశలో ఈ కల్లు దందా బయటకొచ్చింది. కల్తీ కల్లును అందమైన పాల ప్యాకెట్ల వలే తయారు చేసి అమ్మకాలు సాగిస్తుండటంపై ఎక్సైజ్ శాఖ కంటపడింది.
Adultered toddy: ఎక్సైజ్ శాఖ ఆకస్మికంగా మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచమ్మ, కండ్లకోయ, అయోధ్యనగర్ ప్రాంతాల్లో దాడులు చేసి కల్తీ కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నది. తయారు చేసే యంత్రాన్ని, సామగ్రిని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోనే యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారం విస్మయం కలిగిస్తున్నది. ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి కల్తీ కల్లు వ్యవహారంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.