Cyber Fraud: వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు ఏది పడితే అది ఓపెన్ చేయొద్దు.. మీ నగదు పోగొట్టుకోవద్దు.. అని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. మనలో కొందరు అత్యాశతో అలాంటి మెసేజ్‌లు ఓపెన్ చేస్తూ లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి అమాయకలను ఆసరా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఇలాంటి మెసేజ్‌లను రుద్దుతున్నారు.
Cyber Fraud: ఇటీవల ఏపీకే పీడీఎఫ్ ఫైల్స్ అని చలాన్ చెల్లించాలంటూ ఓ ఫైల్ వివిధ గ్రూపుల్లో షేర్ అవుతూ వస్తున్నది. ఈ చలాన్ పీడీఎఫ్ ఏపీకే పేరుతో సైబర్ నేరగాళ్లు ఇలా వల వేస్తున్నారు. ఇదే తరహాలో ఎరువుల డీలర్ల గ్రూప్‌లో వచ్చిన ఇలాంటి ఫైల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎరువుల దుకాణం డీలర్ తెరిచి తీవ్రంగా నష్టపోయాడు.
Cyber Fraud: ఈ చలాన్ పీడీఎఫ్ ఏపీకేని ఎరువుల దుకాణం డీలర్ రాంబాబు తెరవడంతో ఆయన ఫోన్ వేడెక్కింది. అదే సమయంలో విడతల వారీగా రూ.49,500, రూ.10,000, రూ.10,000 చొప్పున ఇలా రూ.70,000 వరకు పోగొట్టుకున్నాడు. వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్లి తన ఖాతాను క్లోజ్ చేయించి, పోలీసులకు బాధితుడు రాంబాబు ఫిర్యాదు చేశాడు.