VPR minus YCP plus

VPR minus YCP plus: రాజకీయం మిస్ అవుతున్న వీపీఆర్ కపుల్..

VPR minus YCP plus: రాజకీయం అంటే సొంత వర్గం, సొంత నెట్‌వర్క్, మీడియా సపోర్ట్‌ సహా రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ విభాగాల్లో సొంత మనుషులు ఉండాలి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో నిలబడాలన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయం చేయగలగాలి అన్నా, తమతో బలంగా నిలబడి.. కనీసం వంద మందిని తమతో తిప్పగలిగే మాస్ లీడర్స్‌ని మనతో ఉంచుకోగలగాలి. ఎంత సేపూ కోట్లు కోట్లు ఖర్చుపెడతాం అంటే కుదరదిక్కడ. దాంతో పాటూ.. కష్టాల్లో, విపత్కర పరిస్థితుల్లో తమ కోసం రిస్క్ చేసే లీడర్స్‌ని, సొంత మనుషులను ఏర్పాటు చేసుకోలేకపోతే, ఎన్ని కోట్లు ఉన్నా రాజకీయాల్లో కంటిన్యూ కావడం కష్టం. ఇదే పరిస్థితిని… నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో వేమిరెడ్డి దంపతులు ఫేస్ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. సొంత డబ్బుతో రాజకీయం చేసే లీడర్స్‌గా తెలుగు రాష్ట్రాల్లో పేరున్న అతి కొద్ది మంది లీడర్స్‌లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు టాప్ పొజిషన్‌లో ఉంటారు. రాజకీయం అంటే హుందాగా, గౌరవంగా, పెద్దరికంతో చేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలైన ఈ భార్యా భర్తలు భావిస్తుంటారని పేరుంది.

ఈ ఇద్దరి లీడర్స్ పనితీరు, రాజకీయం, అభివృద్ధిలో ఎక్కడా రిమార్క్‌లు లేవట, కానీ వీరి పక్కన చేరి, అంతా తామై ఇంట్లో మనుషులతో పాటు కార్యాలయంలో సిబ్బందిని, వ్యక్తిగత సిబ్బందిని, అధికారులను కంట్రోల్ చేస్తున్న ఇద్దరు, ముగ్గురు ఓవర్ యాక్షన్ లీడర్స్‌తో వీపీఆర్‌ కపుల్‌ రాజకీయంగా డ్యామేజ్ అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రజల్లో జగన్ మీద భయం, చంద్రబాబుపై నమ్మకం కలసిరావడంతో పాటూ… సొంత బ్రాండ్‌ ఇమేజ్‌, మంచి పేరు తోడై… నెల్లూరు లోక్‌సభ, కోవూరు శాసనసభ స్థానాల నుండి విపిఆర్ దంపతులు రికార్డ్ మెజారిటీతో గెలుపొందారు. అయితే, వీపీఆర్ దంపతులను మేమే వైసీపీ నుండి బయటకు తెచ్చాము, మేమే టీడీపీలో చేర్పించాము, అసలు మేమే వీపీఆర్ దంపతులను గెలిపించాము, మేము లేకుంటే వీపీఆర్ దంపతులు జస్ట్ బొమ్మలే అనే టైప్‌లో… బయట కాఫీ సెంటర్లలో, మాగుంట లేఅవుట్‌లో, అధికారుల దగ్గర చెప్పుకుంటూ తిరిగే ఇద్దరు, ముగ్గురు లీడర్స్ చేస్తున్న ఓవర్ యాక్షన్‌ని.. ఏడాదిగా నెల్లూరు జనాలతో పాటు, అమరావతి రాజధానిలో కూడా టీడీపీ శ్రేణులు చూడలేకపోతున్నాయంట.

Also Read: Somireddy chandramohan: కొడాలి నాని, వంశీలను అరెస్టు చేయించాలన్నదే పేర్ని నాని కుట్ర

ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజినెస్‌లో గానీ, పాలిటిక్స్‌లో గానీ ఎక్కడా చెడ్డపేరు తెచ్చుకోలేదు. కానీ, వీపీఆర్ దంపతులు మా వల్లే సక్సెస్ అయ్యారు, అంతా నేనే, మేమే అని చెప్పుకునే బ్యాచ్‌…. వీపీఆర్‌కు క్వార్జ్ మైనింగ్‌లో తెల్లరాయి ఖనిజం దుమ్ము మరకల్ని అంటించారట. ఈ వైట్ క్వార్జ్ మైనింగ్ చెడ్డపేరు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని కూడా కొంత డ్యామేజ్ చేసింది. సాధారణంగా ఎన్నికలు, రాజకీయం అంటే సమిష్టిగా చేసే కార్యక్రమం. ఇంట్లో టీ, కాఫీలు ఇచ్చే అటెండర్ మొదలు, కారు డ్రైవర్లు, ఆఫీసు ఉద్యోగులు, బంధుమిత్రులు, అనుచరులు, పార్టీ లీడర్లు తలో చేయి వేసి, ఎవరి స్థాయిలో కంటే వారు ఇంకా ఎక్కువగా ఎన్నికల టైమ్‌లో పని చేశారు, కష్టపడ్డారు. వీపీఆర్ దంపతులు చేసే సహాయ సహకారాలతో ఇంకా ఎక్కువ అభిమానం పెంచుకున్నారు కనుక, దాదాపుగా వెయ్యి మందికి పైగా టీమ్ అహోరాత్రులు ఎన్నికల్లో పని చేశారు. వీపీఆర్ దంపతులు డైరెక్ట్ పాలిటిక్స్‌లో ఫస్ట్ టైమ్ అడుగుపెట్టి ఇంత బంపర్ విక్టరీ కొట్టడానికి మొయిన్ రీజన్ వారు చేసిన మంచి పనులు, దైవబలం, తెలుగుదేశం గాలి, జగన్ అంటే ప్రజల్లో పెరిగిపోయిన భయం.

ఈ ప్రధాన పాయింట్స్ వదిలేసి, వీపీఆర్ ఇంట్లో, వీపీఆర్ కారులో, వీపీఆర్ చుట్టూ చేరి, మిస్‌గైడ్ చేస్తూ, ఇతరులపై చాడీలు చెబుతూ, వీపీఆర్ దంపతులకు పొలిటికల్‌గా విపరీతమైన చెడ్డపేరు వచ్చేలా ఈ టూ, త్రీ మెంబర్స్ కన్నింగ్ లీడర్స్ రోజూ తమ చేష్టలతో టోటల్ వీపీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, తెలుగుదేశం పార్టీకి చిరాకు తెప్పిస్తున్నారట. అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్, ఇసుక, గ్రావెల్, కార్పొరేషన్‌లో పనులు ఇలా ఎక్కడపడితే అక్కడ వీపీఆర్ బ్రాండ్‌ని వాడేస్తూ, పోలీసు, రెవెన్యూ, ప్రభుత్వ విభాగాల్లో తమ కులం వారిని, తమ సొంత మనుషులను ఈ కన్నింగ్ లీడర్స్ నియమించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి వీపీఆర్ దంపతుల చుట్టూ చేరిన ఈ కన్నింగ్‌ లీడర్లు… వీపీఆర్ పొలిటికల్ కెరీర్‌ని బాగానే డ్యామేజ్ చేస్తున్నారని… వీపీఆర్‌ దంపతులపై అసూయతో ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఫుల్‌ ఖుషీగా ఉన్నారట. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర వీపీఆర్ దంపతులకు మంచి క్రేజ్ ఉంది. అది క్రమేపీ ఈ కన్నింగ్ బ్యాచ్ ఆగడాలతో తగ్గుతూ వస్తుందనేది.. టీడీపీలో నడుస్తోన్న డిస్కషనట.

Also Read: Delhi: జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం: ఢిల్లీలో కేంద్ర మంత్రి నేతృత్వంలో కీలక భేటీ

నెల్లూరు ఎంపీగా, కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు సొంత డబ్బుతో రాజకీయం చేసే తీరుకు ప్రతి నియోజకవర్గంలో వారికి సొంత నెట్‌వర్క్ ఇప్పటికే ఏర్పడి ఉండాలి. వీపీఆర్ మనుషులకు, వీపీఆర్‌ని నమ్మి టీడీపీలో చేరిన ఇతర పార్టీల లీడర్లకు కార్పొరేషన్ ఛైర్మన్‌లు, డైరెక్టర్ల పదవులు, జిల్లా పదవులు ఇప్పటికే వచ్చి ఉండాలి. కానీ, నామినేటెడ్ పదవుల్లో వీపీఆర్ మనుషులకు ఎవరికీ న్యాయం జరగడం లేదట. వీపీఆర్ సొంత వర్గం బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం అంటూ డిస్కషన్‌ నడుస్తోంది. వీపీఆర్ సొంత మనుషులను తయారు చేసుకోకుండా… ప్రతి పనికి, ప్రెస్ మీట్లకు ఇతర లీడర్స్‌పై ఆధార పడటం వల్లనే పక్క జిల్లాల్లో దూసుకెళ్తున్న ఎంపీలు మాగుంట, పెమ్మసానిల్లాగా నెల్లూరు జిల్లాలో వీపీఆర్ బ్రాండ్‌ బలపడటం లేదని చర్చ నడుస్తోంది. వీపీఆర్ దంపతులతో పాటు ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరి, మేము తోపు లీడర్స్ అని చెప్పుకున్న వారిలో… చాలా మందికి అసలు వైసీపీలో గుర్తింపు లేక, తమ ప్రత్యర్థులైన వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పవర్ ముందు తట్టుకోలేకే లక్కీగా వీపీఆర్ పక్కన చేరి సక్సెస్ అయిపోయారు అనేది వాస్తవం అంటున్నారు

నెల్లూరు జిల్లా సిటిజన్లు. టఫ్ టైమ్‌లో మన పక్కన నిలబడ్డారనే కృతజ్ఞతతో వీపీఆర్ దంపతులు వారిని చేరదీస్తే, వీపీఆర్‌ సర్వ వ్యవస్థల్లో వారి ‘స్పై’లను ఏర్పాటు చేసుకున్న ఈ కన్నింగ్ లీడర్స్… వీపీఆర్ దంపతుల పొలిటికల్ గ్రాఫ్‌ని డౌన్ చేస్తున్నారని వీపీఆర్ అభిమానులు బాధపడుతున్నారట. అసలు వీపీఆర్ దంపతులకు రెడ్డి సామాజిక వర్గం నుండి బలమైన మౌత్‌ పీస్ లాంటి సొంత వర్గం లీడర్ లేకపోవడం కూడా కుట్ర కోణమే అని ప్రచారం నడుస్తోంది. అసలు వీపీఆర్ దంపతులను బూతులు తిట్టిన నల్లపురెడ్డితో సహా వైసీపీలో టాప్ లీడర్లు… వీపీఆర్ చేరదీసి ప్రయారిటీ ఇస్తున్న ఈ కన్నింగ్ లీడర్స్‌కు మంచి బిజినెస్‌ మేట్సే కాకుండా పేకాట మేట్స్‌ కూడా అని ప్రచారం ఉంది. చూడాలి, ఎత్తులు, పైఎత్తులు, తేనె పూసిన కత్తులతో రాజకీయం చేసే నెల్లూరు పాలిటిక్స్‌లో వీపీఆర్ దంపతులు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా చేస్తారో…!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *