AP BJP Chief: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పు జరగబోతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు వేసే కార్యక్రమం జరుగనుంది. ఈ కొత్త బాధ్యతకు పార్టీ అధిష్టానం పీవీఎన్ మాధవ్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. మాధవ్‌తో పాటు, బీజేపీ సీనియర్ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు కలిసి నామినేషన్ ఫైల్ చేయనున్నారు.రేపు అధికారికంగా పీవీఎన్ మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎవరు ఈ పీవీఎన్ మాధవ్?
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. ఆయన 1973, ఆగస్టు 10న విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. బీజేపీ నుంచి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనిచేశారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు ఉంది.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జులై 4న భారీ బహిరంగ సభ.. విజయవంతం చేయాలని పిలిపునిచ్చిన పొన్నం
2023లో మరోసారి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసిన మాధవ్, ఈసారి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లోకి మాత్రమే కాదు, సామాజిక సేవల వైపుగానూ మాధవ్ పెద్దగా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా, 2024లో విశాఖపట్నంలో జరిగిన ఆర్గానిక్ మేళాలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
మారుతున్న నాయకత్వం.. కొత్త ఊపిరి
బీజేపీ అధిష్టానం మాధవ్‌పై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించనుందని విశ్లేషకుల అభిప్రాయం. పార్టీని ముందుండి నడిపించేందుకు మాధవ్ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.