Tirupati

Tirupati: తిరుపతిలో ఘోరం.. కారులో డెడ్ బాడీ

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు లోని రంగనాథం వీధిలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ పార్క్ చేసిన కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభించడంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ సంఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. మృతులను వినయ్ మరియు దిలీప్ గా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జులై 4న భారీ బహిరంగ సభ.. విజయవంతం చేయాలని పిలిపునిచ్చిన పొన్నం

కారు లోపల నాలుగు బీరు బాటిళ్లు లభించాయి. యువకులు మద్యం సేవించి, అదే కారులో నిద్రపోయిన సమయంలో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూర్తి సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై సాయినాథ్ చౌదరి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *