Fire Accident

Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు మృతి..20 మందికి తీవ్ర గాయాలు..

Fire Accident: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం (జూన్ 30) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. ఈ పేలుడు దారుణంగా ఉండటంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.

కార్మికుల్లో భయాందోళన

పేలుడు చాలా బలంగా ఉండటంతో దాని ప్రభావానికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపోయినట్లు చెబుతున్నారు. అప్పటివరకు పని చేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో చిక్కింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మందికిపైగా మృతి చెందారు అని సమాచారం. 20 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఇది కూడా చదవండి: Ramchander Rao: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే ధృవ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి. సహాయక బృందాలు మరింత మృతదేహాల కోసం వెతుకుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం అధికారిక ప్రకటనను వేచిచూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coffee: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగొద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *