UTTAM KUMAR REDDY: బనకచర్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది

UTTAM KUMAR REDDY: బనకచర్ల ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పది ఏళ్ల పాలనలో తెలంగాణ తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణను సర్వనాశనం చేసినవాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారు’’ ‘‘ఆయన పేరు మార్చుకొని గోబెల్స్ రావు అని పెట్టుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు.

గత పాలనలో ప్రాజెక్టుల డిజైన్‌లు ఇష్టం వచ్చినట్లు మార్చి, అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. “వారు చేసిన అప్పులకు మేం ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం” అన్నారు. ‘‘గోదావరిపై ప్రాజెక్ట్ కట్టినప్పుడే బనకచర్ల అనవసరమవేది’ గోదావరిపై తగిన ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఈ రోజు బనకచర్ల లాంటి వివాదాలు ఏవీ వచ్చేవి కావని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరమైన మార్గంలో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటుందని ఆయన తెలిపారు.

బనకచర్ల నిర్మాణం వల్ల తెలంగాణకు కలిగే నష్టం గురించి కేంద్రానికి బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. ఎత్తిపోతల పనుల్లో జాప్యం కాంట్రాక్టర్లపై చర్యలు అనంతరం జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకంపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం కనిపిస్తే కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *