Raghunandan Rao: బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు తెలంగాణ పోలీస్ శాఖ భద్రతను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నది. ఆయనకు అదనపు భద్రతను పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ఇటీవల ఆయనకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా హతమారుస్తామని రఘునందన్‌రావు సెల్‌కు ఫోన్ చేసి ఆగంతకులు బెదిరించారు. ఈ నేపథ్యంలో ఆయన రక్షణ పెంపు విషయంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
Raghunandan Rao: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రఘునందన్‌రావు సెల్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తితో రఘునందన్‌రావు పీఏ ఆ ఫోన్ కాల్ మాట్లాడారు. ఈ మేరకు ఎంపీ రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెదిరింపు కాల్‌పై డీజీపీ విచారణకు ఆదేశించారు.
Raghunandan Rao: ఇక నుంచి ఎంపీ రఘునందన్‌రావుకు అదనపు భద్రత విషయంపైనా పోలీస్ శాఖ స్పందించింది. రఘునందన్‌రావు పర్యటనల సమయంలో సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్ (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎస్కార్ట్) ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు ఎస్పీలకు పోలీస్ శాఖ ఆదేశాలు జారీచేసింది.