Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నాయకుడు శశి థరూర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో “ఎక్స్” (పూర్వంలో ట్విట్టర్) ద్వారా స్పందించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“రెక్కలు వచ్చినవాడు ఎగరక తప్పదు. ఎగరడానికి ఎవరి అనుమతీ అవసరం లేదు. ఆకాశం ఏ ఒక్కరి సొత్తు కాదు. నీ రెక్కలు నీ ఇష్టం!”
అంటూ థరూర్ కవితాత్మకంగా, బలమైన రాజకీయ సంకేతంతో ఓ సంచలన పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు ఖర్గే ఇటీవల పార్టీ అంతర్గత వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా చూస్తున్నారు. అధిష్టానం క్రమశిక్షణను పాటించాలి, వ్యక్తిగత ప్రచారాలకు పదును పెట్టకూడదనటీవత ప్రకటనల తర్వాత థరూర్ స్పందన ఈ మేరకు రావడాన్ని పలు వర్గాలు “సూక్ష్మ విరోధం”గా అభివర్ణిస్తున్నాయి.
థరూర్ గతంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసిన నేపథ్యంలో, పార్టీ వ్యవస్థలో ఆయనకు ఉన్న స్వతంత్ర అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

