Surya-Ajith: నెట్‌ఫ్లిక్స్ భారీ ధరలకు గుడ్ బ్యాడ్ అగ్లీ, రెట్రో చిత్రాల ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. రెట్రో రూ.80 కోట్లు, గుడ్ బ్యాడ్ అగ్లీ రూ.95 కోట్లకు ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. అయితే, ఈ సినిమాల శాటిలైట్ రైట్స్‌పై సన్ టీవీ మొదట ఒప్పందం కుదుర్చుకుని, విడుదల తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసింది. రెట్రో విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ చిత్రాలు అన్‌సోల్డ్‌గా మిగిలాయి. స్టార్ హీరో చిత్రాల శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోకపోవడానికి ఓటీటీలే కారణం కాదు.
Also Read: Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ!
Surya-Ajith: థియేటర్లలో సినిమాలు ఆకట్టుకోకపోవడం, బజ్ సృష్టించకపోవడం ఛానళ్లను ఆలోచనలో పడేస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీల్లోకి సినిమాలు రావడం, పైరసీ ద్వారా ముందుగా చూసేయడం శాటిలైట్ ఛానళ్లకు నష్టాలను తెచ్చిపెడుతోంది. భారీగా కొనుగోలు చేసిన సినిమాలకు రేటింగ్స్ రాకపోవడం ఛానళ్లకు తలనొప్పిగా మారింది. ఈ ధోరణి ఇలాగే సాగితే, టీవీల్లో సినిమాలు చూడటం భవిష్యత్తులో అరుదైన అనుభవంగా మిగలనుంది.