Prabhas: కేజీఎఫ్ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ, సలార్‌తో మరో అడుగు ముందుకేసింది. తాజాగా హోంబలే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రకటించింది. ఈ యూనివర్స్‌లో ప్రభాస్ భాగమవుతాడనే అభిమానుల అంచనాలు ఉరకలెత్తిస్తున్నాయి, ఎందుకంటే ఆయన హోంబలేతో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
హోంబలే విడుదల చేసిన రిలీజ్ క్యాలెండర్ ప్రకారం: మహావతార్ నరసింహ (2025 జులై 25), మహావతార్ పరశురామ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధవకాదేశ్ (2031), మహావతార్ గోకులనంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037). ప్రభాస్ ఇప్పటికే కల్కి 2898 ఏడీలో నటించాడు కాబట్టి, ఈ కల్కి చిత్రంలో అతడు ఉండకపోవచ్చు. రఘునందన్ పాత్ర శ్రీరాముడిగా ఉంటే, ఆదిపురుష్‌లో ఆ పాత్ర పోషించిన ప్రభాస్ దాన్ని ఎంచుకోకపోవచ్చు. అయితే, పరశురామ, ధవకాదేశ్, గోకులనంద పాత్రల్లో ప్రభాస్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం సలార్ 2 పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ ఈ యూనివర్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని టాక్.

