Kannappa: మంచు విష్ణు హీరోగా ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప” జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే అతిపెద్ద విడుదలగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా 5400కు పైగా స్క్రీన్‌లలో ప్రదర్శనకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, భారత్‌లోనే 4000 స్క్రీన్‌లలో విడుదల కానుంది. ఐమ్యాక్స్, 4డిఎక్స్ వెర్షన్‌లలోనూ ప్రేక్షకులను అలరించనుంది.
బహుళ భాషల్లో, పలువురు స్టార్ హీరోల సమాహారంతో రూపొందిన ఈ చిత్రానికి స్టీఫెన్ డేవెస్సీ సంగీతం అందించగా, మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన “కన్నప్ప” యాక్షన్, డ్రామా, భావోద్వేగాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా విజయం మంచు విష్ణుకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.