Ss Rajamouli: తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. అయన ఇప్పుడు మరో సరికొత్త రంగంలో అడుగుపెట్టారు. ఈ సారి సినిమాలో కాదు, వీడియో గేమ్‌లో.
జపాన్‌కు చెందిన ప్రముఖ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా రూపొందిస్తున్న గేమ్ “డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్” (Death Stranding 2: On the Beach)లో రాజమౌళి అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఈ గేమ్‌లో ఉంటారు.
‘అడ్వెంచరర్’ & ‘అడ్వెంచరర్ సన్’
గేమ్‌లో రాజమౌళిని “ది అడ్వెంచరర్”, కార్తికేయను *”అడ్వెంచరర్‌స్ సన్”*గా గుర్తించారు. గేమ్‌కు ముందుగా యాక్సెస్ పొందిన ఆటగాళ్లు వీరిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడే ఈ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Actor Srikanth: డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశా: కోర్టులో అంగీకరించిన నటడు శ్రీకాంత్
రాజమౌళి – కొజిమా స్నేహం కథ
ఇద్దరి పరిచయం 2022లో RRR సినిమా జపాన్‌లో విడుదలైన సమయంలో జరిగింది. అప్పుడు రాజమౌళి జపాన్ వెళ్లి కొజిమా స్టూడియోను సందర్శించారు. అక్కడే వీరి మధ్య స్నేహబంధం మొదలైంది. అదే పరిచయం ఇప్పుడు గేమ్‌లో క్యామియో అవకాశంగా మారింది.
భారత టాలెంట్‌కు గేమింగ్ ప్రపంచం గుర్తింపు
ఈ గేమ్ 2025 జూన్ 26న PlayStation 5 కోసం విడుదల కాబోతోంది. రాజమౌళి పాత్ర పెద్దది కాకపోయినా, ఒక భారతీయ దర్శకుడు అంతర్జాతీయ గేమ్‌లో కనిపించడం గర్వకారణం. తెలుగు సినిమాకు ఇది మరో మెరుగైన గుర్తింపు. నెటిజన్లు “ఇది మన సినిమాల స్థాయి ఎంత పెరిగిందో చూపిస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమా
ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్ ఇప్పటికే హైలైట్ అయ్యాయి.
#SSRajamouli cameo in #DeathStranding2 pic.twitter.com/FzmpLEwtEd
— TFI Sena 🎥⚔️ (@tfi_sena) June 24, 2025