Actor Srikanth:తమిళ సినీ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) తన తప్పును అంగీకరించాడు. అది కూడా ఓ వ్యక్తి బలవంతం వల్ల తనకు ఆ అలవాటు చేసుకోవాల్సిన ఖర్మ ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు కింద ఇస్తానని బలవంతం చేయడం వల్లే చివరికి తాను లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ తప్పు వల్ల ఇప్పుడు ఆయన కటకటాలు లెక్కించాల్సిన దుస్థితి ఏర్పడింది.
Actor Srikanth:డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం అతనికి జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తికి తన ఆవేదనను శ్రీకాంత్ వ్యక్తంచేశాడు. అన్నా డీఎంకే మాజీ నేత ప్రసాద్ నాకు మత్తు పదార్థాలను అలవాటు చేశాడని నటుడు శ్రీకాంత్ చెప్పాడు. తనకు ఆయన రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాడు. అడిగనప్పడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని, మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసుల విచారణలోనే వెల్లడించాడు.
Actor Srikanth:డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో తొలుత నటుడు శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తొలుత సమన్లు జారీ చేసిన పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. శ్రీకాంత్ రక్త నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపారు. మాజీ డీఎంకే నేత నుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.