Vande Bharat Train

Vande Bharat Train: వందే భారత్’ ఏసీ కోచ్ లో వాటర్ లీక్.. 8 గంటలు నరకం చూసిన ప్రయాణికులు

Vande Bharat Train: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు మరోసారి వార్తల్లోకెక్కింది. హైటెక్‌ సదుపాయాలతో, వేగంగా ప్రయాణించేలా రూపొందించిన ఈ రైలు… అందులో ప్రయాణిస్తున్న  వారికి మరిచిపోలేని దారుణమైన అనుభవం కలిగించింది. వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ ట్రైన్‌ లోని సీ-7 కోచ్‌లో ఏసీ నుంచి వర్షం నీళ్లు  లీక్ అవడంతో లోపాలకి వచ్చేసాయి.

ఒకట్రెండు కాదు… ఏకంగా 8 గంటల పాటు నీళ్లు ఆగకుండా కారుతూ వచ్చాయట. ఈ దృశ్యాన్ని బుక్కైన ప్రయాణికుడు ధర్మిల్ మిశ్రా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన సీటు తడిసిపోయిందని, ప్రయాణ సమయంలో నిలబడే ఉన్నానని, సరైన స్పందన లేకపోవడం బాధాకరం అని తెలిపారు. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు కూడా చేశారు.

ఈ ఘటనపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

  • “ఇది ఏసీ కాదు సర్, నేరుగా వాటర్ ఫాల్!”

  • “వేడి పెరిగింది కాబట్టి రైల్వే శాఖ చల్లదనం కోసం ఈ ఏర్పాటు చేసిందా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

హై ప్రొఫైల్ రైలు అయినా, ఇలాంటి వాటర్ లీకేజులు ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు వేస్తున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించే పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల ఫిర్యాదును విచారించి తగిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ప్రకటించారని సమాచారం.

ఇది కూడా చదవండి: Crime News: వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ సేవలు విస్తరిస్తున్న వేళ, ఇలాంటి లోపాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణంలో భద్రత, సౌకర్యం రెండూ సమానంగా ఉండాలని అంటున్నారు.

ఇలాంటి ఘటనలు ఇక పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. హై క్వాలిటీ, హై స్పీడ్ ట్రైన్ అన్న పేరు నిలబెట్టుకోవాలంటే మరింత జాగ్రత్త అవసరమని నిపుణుల అభిప్రాయం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: క్రికెట్ ఆడుతూ విజయ్‌ అనే యువకుడు గుండెపోటుతో మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *