ENG vs IND

ENG vs IND: ఈ లెక్క ప్రకారం భారత్.. మరో లెక్క ప్రకారం ఇంగ్లాండ్.. గెలుపెవరిది..?

ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఫలితం తేలనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. 6 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ టార్గెట్ 371 రన్స్.

ఇంగ్లాండ్ ఓపెనర్లు బాగా ఆడుతున్నారు. 100 రన్స్ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. గతంలో బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు చివరి ఇన్నింగ్స్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. అది కూడా టీమిండియాపైనే కావడం విశేషం. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ 76.4 ఓవర్లలో భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: Dilip Doshi: భారత క్రికెట్‌కు తీరని లోటు: దిగ్గజ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూత!

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టీమిండియా 350+ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 59 టెస్ట్ మ్యాచ్‌ల్లో చివరి ఇన్నింగ్స్‌లో భారత్ 350+ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సమయంలో భారత్ 42 సార్లు గెలిచింది. మరో 16 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే భారత జట్టు చివరి ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చిన చరిత్ర కలిగి ఉంది. ఇదే ఆలోచనతో టీమిండియా గెలుపు ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఈ రెండు లెక్కల మధ్య ఉన్న ట్విస్ట్ ఏమిటంటే.. 350+ లక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఇంగ్లాండ్‌పైనే. అంటే 2022లో భారత్‌పై ఇంగ్లాండ్ 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్ ఎప్పుడూ 370+ పరుగులను ఛేదింస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: అకారణ కోపంతో ఈ రాశివారికి ఇబ్బందులున్నాయట.. జర భద్రం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *