Siddharth: సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3 BHK’ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ‘మావీరన్’ బ్లాక్‌బస్టర్‌తో సత్తా చాటిన అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొదటి సింగిల్ ‘కలలన్నీ’ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన రెండో సింగిల్ ‘ఆగిపోను నేను’ అభిమానులను అలరిస్తోంది. అమృత్ రామ్‌నాథ్ ఎనర్జీటిక్‌గా కంపోజ్ చేసిన ఈ పాటకు దేవ సాహిత్యం అందించి, అద్భుతంగా ఆలపించారు. సిద్ధార్థ్ వైవిధ్యమైన లుక్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Renu Desai: దయచేసి సాయం చేయండి.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
Siddharth: ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అమృత్ రామ్‌నాథ్ సంగీతం, దినేష్ కృష్ణన్, జితిన్ స్టానిస్లాస్ సినిమాటోగ్రఫీ, గణేష్ శివ ఎడిటింగ్, రాకేందు మౌళి డైలాగ్స్ ఈ చిత్రానికి బలం. ఈ సినిమా సిద్ధార్థ్‌కు మరో హిట్‌ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


