Horoscope Today: మంగళవారం, జూన్ 24, 2025 నాడు 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలాంటి ప్రభావం చూపనున్నాయో జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఎలాంటి అనుకూలతలు లేదా సవాళ్లు ఎదురుకానున్నాయో తెలుసుకోండి.
మేషం:
మేష రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. అంతర్గత సమస్యలు ఇబ్బంది పెట్టినా, తెలివితేటలతో వాటిని అధిగమించవచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. దుర్గాధ్యానం శుభప్రదం.
వృషభం:
వృషభ రాశి వారు ప్రారంభించిన పనుల్లో మనోబలంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా, ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. దుర్గా శ్లోకం చదవడం మంచిది.
మిథునం:
మిథున రాశి వారికి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు విజయాలను అందిస్తాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి అవకాశాలు రావచ్చు, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది. అందరినీ కలుపుకుని ముందుకు సాగితే మంచి జరుగుతుంది. శివారాధన రక్షణ కవచంగా ఉంటుంది.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి పని ఆశించిన విధంగా పూర్తవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహ శ్లోకాలు వల్ల శ్రేయస్సు కలుగుతుంది.
సింహం:
సింహ రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉన్నా, అధికారులు మీపై నమ్మకంతో ఉంటారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
కన్య:
కన్య రాశి వారు స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనా త్వరగా పరిష్కారం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. చంద్ర ఆరాధన శుభకరం.
తుల:
తుల రాశి వారు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనవ్యయానికి సంబంధించిన విషయాల్లో అదుపు అవసరం. జీర్ణ సమస్యలు రాకుండా సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోకుండా కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి శుభకాలం. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు, మంచి నిర్ణయాలు వెలువడతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ముందస్తు ప్రణాళికలు అవసరం. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. విష్ణు ఆరాధన అనుకూల ఫలితాలతో పాటు శ్రేయస్సును అందిస్తుంది.
Also Read: Leaves To Diabetes: షుగర్ కి చెక్.. రాత్రి పడుకునే ముందు ఈ ఆకులతో ఇలా చేయండి
మకరం:
మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. కీలక విషయాలలో పెద్దల మద్దతు అవసరం. కుటుంబ సభ్యులతో అనురాగభావం పెంపొందించుకోండి. ఆదాయం పెరిగి, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. శివాష్టోత్తరం చదవడం శుభప్రదం.
కుంభం:
కుంభ రాశి వారు ప్రారంభించిన పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలలో బుద్ధిబలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విష్ణు ఆరాధన ఫలప్రదం.
మీనం:
మీన రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఇతరుల సాయం పొందుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. శ్రీరామ నామస్మరణతో మీ అభివృద్ధి మరింత మెరుగవుతుంది.
