Anupama: మలయాళ కోర్ట్ రూమ్ డ్రామా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విడుదలకు ముందు సెన్సార్ బోర్డు అడ్డంకులు ఎదుర్కొంది. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం టైటిల్‌లో ‘జానకి’ పేరు వాడటంపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి పేరు హిందూ దేవతకు సంబంధించినదని, మతపరమైన భావాలను గాయపరిచే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు తెలిపింది. దీంతో సినిమాకు సర్టిఫికెట్ నిరాకరించింది.
‘జానకి’ బదులు ‘అనుపమ’ అని పేరు మార్చాలని సీబీఎఫ్‌సీ సూచించగా, నిర్మాతలు దీనిని తిరస్కరించారు. ఫలితంగా సినిమా థియేటర్లలో విడుదల అనిశ్చితంగా మారింది. ఈ నిర్ణయంపై ఫెఫ్కా కార్యదర్శి తీవ్రంగా స్పందిస్తూ, ఇది సృజనాత్మకతపై దాడి అని విమర్శించారు. “జానకి అనే పేరు ఉన్న ప్రతి ఒక్కరినీ నిషేధిస్తారా?” అని ప్రశ్నించారు.
ఈ చిత్రంలో సురేష్ గోపి ఒక బాధిత యువతి తరపున న్యాయం కోసం పోరాడే న్యాయవాదిగా కనిపిస్తారు. ఉద్వేగభరితమైన కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలతో సతమతమవుతోంది. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
Central Board of Film Certification has demanded a name change for the film ‘JSK – Janaki Vs State of Kerala’, starring Union Minister #SureshGopi #JSK #JanakiVsStateOfKerala https://t.co/Ubn6tsPPBZ
— The Hindu – Kerala (@THKerala) June 23, 2025
