Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌ను గొల్లకురుమలు సోమవారం (జూన్ 23) ముట్టడించారు. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గొర్రెలను తోలుకొచ్చి, గాంధీభవన్ ఆవరణలో ఉంచి ఆందోళనకు దిగారు. గొల్లకురుమలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాంధీభవన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు.

Gandhi Bhavan: ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎస్సీలకు, ఒక బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీసీలకు అందునా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న గొల్లకురుమలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దీంతో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా మంత్రివర్గంలో చోటు కల్పించాలని, అది కూడా స్థానిక ఎన్నికలకు ముందే ప్రకటించాలని, లేకుంటే స్థానిక ఎన్నికల్లో గొల్లకురుమల తడాకా చూపుతామని ఆందోళనలో పాల్గొన్న నేతలు హెచ్చరించారు.

