Nude Video Call: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలుడు, తన వయసు బాలికను స్నేహం పేరుతో పరిచేయం చేసుకున్నాడు, తర్వాత ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియా ద్వారా మొదలైన ఈ పరిచయం, ఆ బాలిక జీవితం మొత్తాన్ని కలవరపరిచే దిశగా మారింది.
ఏం జరిగింది?
ఆ బాలుడు, బాలికతో మొదట స్నేహంగా మాట్లాడాడు. అనంతరం ఆమెపై ఒత్తిడి తెచ్చాడు నగ్నంగా వీడియో కాల్ చేయాలి అంటూ లేదంటే మనం మాట్లాడిన చాటింగ్‌ను నీ తల్లిదండ్రులకు చూపిస్తాను అని బెదిరించాడు. భయంతో బాలిక వీడియో కాల్ చేసింది. ఆ వీడియోను బాలుడు రికార్డ్ చేసి తన స్నేహితులకు పంపాడు. ఈ వీడియో కొద్ది రోజుల్లోనే గ్రామంలో వైరల్ అయింది.
బాలిక భయంతో తల్లిదండ్రులకు తెలిపింది
ఈ ఘటన వల్ల బాలిక తీవ్ర మానసికంగా క్షోభకు లోనైంది. చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
ఇది కూడా చదవండి: Stock Market: కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్.. రూ.3 లక్షల కోట్లు నష్టం
పోలీసుల దర్యాప్తు
ఈ కేసును శీటీం బృందం సహాయంతో సీఐ రాజు నేతృత్వంలో విచారించారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదైంది. వీరిలో ఇద్దరు మైనర్లు కాగా, మిగిలిన ఆరుగురు పెద్దవారు.
పోక్సో చట్టం కింద కేసు
వీరి పేర్లు ఇలా ఉన్నాయి:
-
బాలుడు (16),
-
మరొక బాలుడు (15),
-
వంశీకృష్ణ (20),
-
పవర్ తరుణ్ (18),
-
సాబ్లె బాలవంత్ సింగ్ (18),
-
గుండల్వార్ వరుణ్ (18),
-
కారడ్ సుధీర్ (28),
-
ముర్కుటే విఠల్ (23)
పోలీసులు వీరిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఇద్దరు బాలురను నిజామాబాద్ జువైనల్ హోంకి తరలించగా, మిగిలిన పెద్దవారిని రిమాండ్‌కు పంపించారు.
తల్లిదండ్రులకు హెచ్చరిక
పోలీసులు తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. పిల్లలు ఎవరితో, ఎలాంటి మెసేజ్‌లు, వీడియోలు పంచుకుంటున్నారో గమనించాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

