Hyderabad: భాగ్యనగరంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పహాడీషరీఫ్ ప్రాంతంలోని ముస్తఫానగర్లో ఉన్న ఒక పరిశ్రమలో, ముఖ్యంగా పెళ్లి డెకరేషన్ సామాగ్రిని నిల్వ ఉంచే గోడౌన్లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పొగ, మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read: BALMURI VENKAT: కౌషిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసిండు.. అందుకే అరెస్ట్ అయ్యిండు..
Hyderabad: అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎటువంటి ప్రాణనష్టం జరిగిందా లేదా ఆస్తి నష్టం ఎంత అనే వివరాలు కూడా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. అధికారులు మంటలను ఆర్పేసి, నష్టం అంచనా వేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.
