Devi Sri Prasad

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్.. హ్యాట్రిక్ హిట్స్‌తో సంచలనం!

Devi Sri Prasad: సంగీత దిగ్గజం దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన స్వర మాయాజాలంతో అలరిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సంగీతంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న డీఎస్‌పీ, ‘పుష్ప2’, ‘తండేల్’, ‘కుబేర’ సినిమాలతో ఘనమైన కంబ్యాక్ ఇచ్చాడు. ‘పుష్ప2’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన దేవీ, పాటలతో పాటు బీజీఎంతో సినిమా హైప్‌ను ఆకాశానికి తాకించాడు.

‘తండేల్’ సినిమా సంగీతం ప్రేక్షకుల మనసులు గెలిచి, సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపింది. ఈ సినిమా పాటలు గత ఏడాది టాప్ ట్రాక్స్‌లో చోటు సంపాదించాయి. ఇక ‘కుబేర’ సినిమాతో దేవీ మరోసారి సత్తా చాటాడు. ధనుష్, నాగార్జున నటన, శేఖర్ కమ్ముల దర్శకత్వంతో పాటు, దేవీ బీజీఎం సినిమా భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రశంసలు అందుకుంది.

Also Read: 8 Vasanthalu: ఎనిమిది వసంతాలు’ – ప్రేమకు కొత్త నిర్వచనం, కానీ కథలో లోటు!

Devi Sri Prasad: ‘కంగువా’ సినిమా విఫలమైనా, దేవీ సంగీతం మాత్రం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం దేవీ చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి డెబ్యూ చిత్రం ‘జూనియర్’ ఉన్నాయి. మొత్తానికి ఈ హ్యాట్రిక్‌తో దేవీ మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *