Jurala Praject: కృష్ణా బేసిన్‌లోని ఖరీఫ్ రైతులకు శుభసూచికం కనిపిస్తున్నది. నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశానికి వచ్చినా, ఆ తర్వాత కొంత వెనుకడుగు వేశాయి. అయినా తరచూ కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద దిగువకు చేరుతున్నది. శ్రీశైలం ఎగువనున్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నది.
Jurala Praject: ఇక నుంచి ఎగువ నుంచి వచ్చే వరదనీరంతా శ్రీశైలానికి చేరుకోనున్నది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులోకి 97000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగవకు 88,835 క్యూసెక్కుల నీటిని శ్రీశైల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Jurala Praject: వరద ప్రవాహం పెరుగుతుండటంతో జూరాల రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమటం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.55 మీటర్లకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 క్యూసెక్కులు కాగా, ఇప్పటికే సమీపానికి చేరుకున్నది. అదే విధంగా ఎగువ, దిగువ జూరాల విద్యుత్కేంద్రాల నుంచి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఎత్తిపోతల పథకాలను నీటి విడుదల కొనసాగుతున్నది.