AP Lawcet Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్ 2025 (AP LAWCET 2025), పీజీఎల్‌సెట్ (PG LAWCET 2025) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, ఈఆర్ఆర్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది లాసెట్ పరీక్షల్లో ఏకంగా 95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయిలే నిలిచి తమ సత్తా చాటడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
మీ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :
AP Lawcet Results 2025: పరీక్ష వివరాలను వెల్లడిస్తూ, లాసెట్‌కు మొత్తంగా 27,253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 20,826 మంది అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏపీ లాసెట్-2025 పరీక్షను జూన్ 5న ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్‌టికెట్ నంబర్, అలాగే పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది.

