Kubera

Kubera: కుబేరాకు తమిళనాట దిమ్మతిరిగే షాక్?

Kubera: తెలుగు సినీ ప్రియుల హైప్‌తో కుబేరా సందడి చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, నాగార్జున క్రేజ్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రిలీజ్‌కు ముందే సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అయితే, తమిళనాడులో మాత్రం ఊహించని పరిస్థితి! ధనుష్‌కు అక్కడ బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. గత చిత్రాలైన రాయన్, కెప్టెన్ మిల్లర్‌లకు వచ్చిన ఓపెనింగ్స్‌తో పోలిస్తే కుబేరా బుకింగ్స్ తక్కువగా నమోదయ్యాయి. గత దశాబ్దంలో ధనుష్ సినిమాల్లో ఇదే అత్యల్ప ప్రీ-బుకింగ్స్ అని సినీ వర్గాల టాక్. తమిళ ఆడియన్స్‌తో ప్రమోషన్స్ కనెక్ట్ కాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తమిళనాడులోనూ కుబేరా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా వస్తే వీకెండ్‌లో సినిమా ఊపందుకోవచ్చు. ఇప్పటికైతే తమిళనాట పరిస్థితి అంత గొప్పగా లేదు. కుబేరా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *