Chandrababu Naidu: కుప్పంలో జరిగిన అమానుష ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు చెల్లించడం లేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇతర నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అధికారులు అండగా ఉండాలని సీఎం సూచించారు. ఈ దారుణ మారణ ఘటన ఏమిటో తెలుసుకుందాం రండి..
Chandrababu Naidu: చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళ భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేండ్ల క్రితం రూ.80 వేలు అప్ప తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేక తన భార్యాబిడ్డలను, గ్రామాన్ని వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో శిరీష తన ఇద్దరు పిల్లలను సాదుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం పొందుతున్నది. అంతో ఇంతో అప్పు కూడా తీర్చసాగింది.
Chandrababu Naidu: అనుకున్న సమయంలో అప్పు తీర్చడం లేదంటూ శిరీషను మునికన్నప్ప కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించసాగారు. ఈలోగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, పట్టుకొచ్చి చెట్టుకు తాళ్లతో బంధించి దారుణంగా కర్రలతో చేతులతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఉమ్మివేస్తూ వేధించారు. ఊరి వారందరి ఎదుటే తీవ్ర అవమానాలకు గురిచేశారు. అప్పు తీరుస్తానని ఆ మహిళ వేడుకుంటున్నా వినకుండా దారుణంగా కొట్టారు.
Chandrababu Naidu: ఈ ఘటనను గ్రామస్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. అది కాస్తా సీఎం చంద్రబాబు వరకూ చేరడంతో వెంటనే ఆయన స్పందించారు. వెంటనే ఆ జిల్లా ఎస్సీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్టు చంద్రబాబుకు ఎస్సీ చెప్పారు. ఇతర నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీచేశారు.