Thammudu: యూత్ స్టార్ నితిన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘తమ్ముడు ’ సినిమా అందరి దృష్టిని ఆకర్ష్టస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ ఫన్, యాక్షన్‌తో కూడిన కంటెంట్‌తో అభిమానుల్లో హైప్‌ను పెంచింది. సాధారణంగా సినిమాలకు పాటలు, టీజర్‌ల తర్వాత ట్రైలర్ వస్తుంది కానీ, ఈ చిత్రం విషయంలో ట్రైలర్ తర్వాత మొదటి సింగిల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ గీతం జూన్ 17 సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చగా, దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 4న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలంటే రిలీజ్ వరకు వేచి ఉండాల్సిందే!

