CM Chandrababu: జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటించి, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
యోగాంధ్ర 2025: ప్రధాని పర్యటనకు సన్నాహాలు
“యోగాంధ్ర 2025” పేరుతో నిర్వహించనున్న ఈ భారీ యోగా కార్యక్రమం కోసం ఆర్కే బీచ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి ఆయన పలు సూచనలు చేశారు. ప్రధానంగా, కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీల భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా సీఎంకు భద్రతా ఏర్పాట్ల వివరాలను వివరించారు.
Also Read: Mahesh kumar goud: మంత్రి పొంగులేటి పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పర్యటనలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్థసారధి, కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రణాళికలో లేకపోయినా, సీఎం చంద్రబాబు ఆకస్మికంగా గీతం యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ అధికారులతో మాట్లాడి కొన్ని విషయాలపై చర్చించారు.
మధ్యాహ్నం, పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. యోగా వేడుకలకు ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించడంపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం, ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు.