Aamir Khan

Aamir Khan: తుర్కియే అధ్యక్షుడిపై ఆగ్రహం.. అమీర్ ఖాన్ ఎమోషనల్ స్పందన!

Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల వైరల్‌ అయిన ఓ పాత ఫొటోపై స్పందించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో 2017లో దిగిన ఫొటోను ఇప్పుడు వివాదాస్పదం చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక నటుడిగా విదేశాలకు వెళ్లినప్పుడు ఫొటోలు దిగడం సహజం. ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు తప్పుగా చిత్రీకరించడం సరికాదు,” అని అమీర్ వ్యాఖ్యానించారు. తుర్కియే వైఖరిపై భారతీయులంతా ఆగ్రహంతో ఉన్నారని, అయినప్పటికీ గతంలో భూకంప సమయంలో భారత్ ఆ దేశానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. అమీర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదంపై అమీర్ హృదయపూర్వక స్పందన ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *