Daggubati Purandeswari

Daggubati Purandeswari: వికసిత్ భారత్.. పేదలకు మేలు చేయడమే లక్ష్యం..!

Daggubati Purandeswari: పేదల అభివృద్ధి, దేశ ఆర్థిక శక్తి పెంపు ద్వంద్వ లక్ష్యాలతో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వికసిత్ భారత్‌గా ముందుకు సాగుతోంది, అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్డీయే కూటమి పాలన పట్ల ప్రజల ఆశీర్వాదం, విశ్వాసానికి అది గలిగిన జవాబుదారీతనమే ప్రామాణికమని స్పష్టం చేశారు.

80 కోట్ల మందికి రేషన్, అవినీతి రహిత పాలన
“ప్రస్తుతం దేశంలో దాదాపు 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెద్దమొత్తంలో పేదలకు మద్దతు,” అని పురందేశ్వరి చెప్పారు. డిజిటల్ మాధ్యమాల వాడకంతో ప్రభుత్వం అవినీతి లేని పాలన అందించగలిగిందని ఆమె వివరించారు. ప్రజల నిధులను సురక్షితంగా, సక్రమంగా ఉపయోగిస్తున్నామన్న నమ్మకం ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు.

పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు నివేదిక
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో పేదరికం ఐదు శాతం మేర తగ్గిందని పురందేశ్వరి వెల్లడించారు. ఇది మోదీ సర్కార్ తీసుకున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విజయానికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం!

ఆర్థికంగా ప్రపంచంలో 4వ స్థానం
“ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇప్పటికే జర్మనీని మించిపోయాం. త్వరలో జపాన్‌ను దాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం,” అని ఆమె పేర్కొన్నారు. దేశ ఆర్థిక శక్తిని పెంచుతూ, సామాన్యుడికి మేలు చేసే విధంగా పాలన కొనసాగుతుందని చెప్పారు.

వికసిత భారత్ అమృతకాలం – సేవా పరిపాలనకు ప్రతీక
“గత 11 సంవత్సరాలుగా దేశం వికసిత్ భారత్ అమృతకాలంలో అడుగులు వేస్తోంది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం కేంద్రంగా తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధికి బీజం వేశాం,” అని పురందేశ్వరి వివరించారు.

మోదీకి ప్రజల మద్దతే పునర్విజయం రహసం
ప్రజలు ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో ప్రతి ఎన్నికల్లో ఆదరణ ఇస్తున్నారని, అది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని పురందేశ్వరి పేర్కొన్నారు. “ఎన్నికలకల్లా మేము మోదీ పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్ తో వస్తాం. అదే మా నైతిక బలానికి ప్రతీక” అని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *