The RajaSaab Teaser

The RajaSaab Teaser: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ వచ్చేసింది..ఫ్యాన్స్ కు పూనకాలే

The RajaSaab Teaser: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2898 ఎ.డి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న పూర్తి కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ సినిమా ఇదే కావడం విశేషం. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి సరిపోయేలా, హారర్ – రొమాంటిక్ – కామెడీ మిక్స్‌డ్ జానర్‌తో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఓల్డ్ లుక్‌లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. “వింటేజ్ డార్లింగ్ వచ్చేస్తున్నాడు!” అనే ఫీలింగ్ ఫ్యాన్స్‌లో మొదలైంది.

టీజర్ తో తెగ హైప్ పెంచిన డార్లింగ్

కొద్దిసేపటి క్రితం విడుదలైన ‘రాజాసాబ్’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మారుతితో సినిమా అనగానే కొంతమంది అభిమానులు సందేహంగా ఉన్నా, ఈ టీజర్ చూసాక మాత్రం “ఇదే మా డార్లింగ్ మళ్లీ వచ్చాడు!” అంటూ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. టీజర్‌లో ప్రభాస్ వింటేజ్ మాస్ లుక్ అదిరిపోయింది.

తమన్ BGM – డైలాగ్ హైలైట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది. చివర్లో ప్రభాస్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది.

హీరోయిన్ల గ్లామర్, మాస్ కామెడీతో పక్కా ఎంటర్‌టైనర్

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, రొమాన్స్‌తో పక్కా ప్యాకేజీగా చిత్రాన్ని మలుస్తున్నాడు మారుతి. ప్రభాస్ కెరీర్‌లో ఇదే మొదటి హారర్ కామెడీ మూవీ కావడం మరో ప్రత్యేకత.

ఫ్యాన్స్ కోసం స్పెషల్ థియేటర్ స్క్రీనింగ్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెలెక్టెడ్ థియేటర్లలో టీజర్‌ను అభిమానుల కోసం ప్రత్యేకంగా స్క్రీన్ చేశారు. థియేటర్‌లో డార్లింగ్ సందడి చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.

డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయబోతోన్న రాజాసాబ్

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ‘రాజాసాబ్’ డిసెంబరు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *