Director Maruthi

Director Maruthi: అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు.. ద‌ర్శ‌కుడు మారుతి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Director Maruthi: ప్రముఖ తెలుగు దర్శకుడు మారుతి దాసరి తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, సోషల్ మీడియా వేదికగా ఒక హృదయాలను కదిలించే భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. తన సొంతూరు మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్ థియేటర్) వద్ద తన కటౌట్‌ ను చూసిన ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో తడిసి ముద్దయ్యారు.

“ఇక్కడే మా నాన్నగారికి అరటిపండ్ల స్టాల్ ఉండేది. చిన్నప్పుడు ఈ థియేటర్‌కి వచ్చే సినిమాలకి బ్యానర్లు రాస్తూ, ‘ఒక్కసారి నా పేరు కూడా ఈ బ్యానర్‌పై కనిపించాలని’ కలలు కనేవాడిని. నేడు అదే థియేటర్ ఎదుట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కటౌట్ పక్కన నా కటౌట్‌ను చూడడం… మాటల్లో చెప్పలేని అనుభూతి. మా నాన్న ఈ దృశ్యం చూసేవాడయితే ఎంతగానో గర్వపడేవాడు. మిస్ యూ నాన్న!” అంటూ మారుతి ఎక్స్ (ట్విట్టర్) లో ఎమోషనల్ పోస్టు చేశారు.

ఈ పోస్ట్‌ సినీ అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకుల హృదయాలను కూడా కదిలించింది. చాలా మంది నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ పోస్ట్‌కు స్పందిస్తూ మారుతి ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నారు. తన చిన్ననాటి కల నెరవేరిన తీరు, మూలాలను మరిచిపోని అతని ధోరణి, ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: Madhoo: ముద్దు సన్నివేశంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు?

ఇది కేవలం ఒక దర్శకుడి వ్యక్తిగత పోస్ట్ మాత్రమే కాదు… కలలు కనేవారికి, వాటి కోసం శ్రమించే వారికీ జీవితంలో ఎప్పటికైనా అవకాశం వస్తుందన్న సజీవ ఉదాహరణ కూడా.

ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ టీజర్‌ను ఈ రోజు ఉదయం 10:52 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ టీజర్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు. మచిలీపట్నం సహా పలు థియేటర్ల వద్ద టీజర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో, పెద్దఎత్తున కటౌట్స్ వేశారు. ముఖ్యంగా సిరి కాంప్లెక్స్ వద్ద ప్రభాస్ – మారుతి కటౌట్ చూసిన వారంతా ఈ ఘట్టాన్ని ఫొటోల్లో, వీడియోల్లో పట్టుకుని షేర్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించగా, మారుతి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. టీజర్ రిలీజ్ వేళానే కాక, దర్శకుడు మారుతి వ్యక్తిగత ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం చర్చనీయాంశమవుతోంది.

ALSO READ  Chhaava in Parliament: పార్లమెంట్‌లో 'ఛావా' మూవి స్పెషల్ స్క్రీనింగ్?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *