Crime News: మద్యం వ్యసనపరులతో ఒక్క నిమిషమో, రెండు నిమిషాలో వేగాలంటే వద్దురా బాబు అంటూ మనం సైడ్ అయి పోతాం.. మరి భార్య, ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం ఆ గోస తప్పదు మరి. ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి.. ఇలా నిత్యం కాళరాత్రే ఆ ఇల్లాలుకు. వేగలేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయినా మార్పు రాలేదు.. ఏకంగా తన పసపు, కుంకుమలనే దూరం చేసుకునేందుకే తెగించింది.
Crime News: ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీషన్ అలీ తన భార్యతో కలిసి 20 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నది. పూలవ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆ కుటుంబం నివాసం ఉంటున్నది. హాయిగా కొంతకాలం ఆ కుటుంబం బాగానే ఉన్నది. ఆ తర్వాత జీషన్ అలీ మద్యానికి బానిసయ్యాడు.
Crime News: జీషన్ అలీ రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తుండేవాడు. ఎంతగా బతిమిలాడినా అతనిలో మార్పు రాలేదు. ఇక వేగలేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగుడు మానిపించాలని, తన బతుకు తీర్చిదిద్దాలని వేడుకున్నది. పోలీసులు జీషన్ అలీని మందలించి వదిలేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. యథావిధిగా తాగుతూ వేధింపులకు గురిచేయసాగాడు.
Crime News: జీషన్ అలీ వేధింపులతో అతని భార్య రోజూ నరకం చూస్తున్నది. దీంతో ఇక వేగలేనని డిసైడ్ అయింది. పోలీసులు చెప్పిన మారకపోవడంతో తనకు సుఖం లేదనుకున్నది. చివరికి భర్తను కడతేర్చాలని నిర్ణయించుకున్నది. తాగుడు మానాలని చెప్పిన ఆ ఇల్లాలు బలవంతంగా జీషన్ అలీకి మద్యం తాగించింది. ఇక ఇనుప రాడ్డుతో తలపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వేధింపులను తట్టుకోలేక ఆ మహిళా ఇంతటి దారుణానికి ఒడికడుతుందా? అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నయాన్నో, భయాన్నో భర్తను మార్చుకుంటే భాగుండేది కదా అని చెప్తున్నారు.

