Peddi

Peddi: ఆఫ్ లైన్లో ఆగని పెద్ది రచ్చ!

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం “పెద్ది” హైప్‌ను ఊపేస్తోంది. ఐపీఎల్ సీజన్‌కు ముందు విడుదలైన “పెద్ది” ఫస్ట్ గ్లింప్స్ దేశవ్యాప్తంగా సందడి చేసింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ గ్లింప్స్ యువతను ఉర్రూతలూగించింది. ఇటీవల ఎమ్మిగనూరు, గుడికల్ గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో “పెద్ది” జోష్ మామూలుగా లేదు! యువత, చిన్నారులు కూడా స్టైలిష్ కాస్ట్యూమ్స్‌తో, “పెద్ది” బ్యాట్‌లు పట్టుకుని రామ్ చరణ్ ఐకానిక్ షాట్‌ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ సినిమా క్రేజ్ రోజురోజుకూ ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్ కాగా, వృద్ధి సినిమాస్ భారీగా నిర్మిస్తోంది. సోషల్ మీడియా నుంచి ఊరవాత జోష్ వరకూ “పెద్ది” ఫీవర్ అగ్గిరాజేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు!

 

View this post on Instagram

 

A post shared by 123telugu (@123teluguofficial) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *