Flight Accident: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అదే విమానాన్ని నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ కూడా దుర్మరణం పాలయ్యారు. విమానంలో ఉన్న ఒక్క ప్రయాణికుడు తప్ప మిగతా ప్రయాణికులు, సిబ్బంది, పైలెట్లు అంతా ఈ ప్రమాదంలో మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయారు. పైలెట్ తన తండ్రికిచ్చిన మాటను నిలుపుకోకుండానే కానరాని లోకాలకు తరలిపోయారు.
Flight Accident: ఎయిర్ ఇండియా విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. విమాన ప్రమాద ఘటన అనంతరం ఆయనను కదిలిస్తే కన్నీటి పర్యంతమయ్యారు. తనకిచ్చిన మాట తీర్చకుండానే తన కొడుకు తనకు దూరమయ్యాడని విలపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను వదిలి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుండటంతో సభర్వాల్ తరచూ బాధపడేవాడని అతని తండ్రి చెప్పారు.
Flight Accident: పైలెట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా.. అని ఎయిర్ ఇండియా విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తన తండ్రికి మాటిచ్చారు. అదే విషయాన్ని ఆయన తండ్రి తలచుకొని విలపించారు. పైలెట్ ఉద్యోగం మానేసి నీవద్దే ఉంటా నాన్నా.. అని మాటిచ్చాడు. ఆ మాట తీరకుండానే తన బిడ్డ కన్నుమూశాడు.. అని ఆ వృద్ధ తండ్రి విలపిస్తుంటే అక్కడున్న వారందరి కళ్లల్లో కన్నీటి సుడులు తిరిగాయి.