Chennai Metro: తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైలో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకున్నది. నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు రెండు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరగడంతో అంతగా జననష్టం సంభవించలేదు.
Chennai Metro: మెట్రో రైలు రెండు పిల్లర్లు కూలిన ఘటనపై పరిశీలించేందుకు సంబంధిత అధికారుల బృందం రంగంలోకి దిగింది. చెన్నై రామాపురం ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లినట్టయింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రమాదంతో ప్రాజెక్టు పనులకు కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నది.


